హైదరాబాద్, జూలై 14
అక్షర చాతుర్య
కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత నెల రోజులుగా హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం కన్నుమూశారు.
రాజకీయాల్లో ప్రత్యేక స్థానం
1953లో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించిన ముద్రగడ పద్మనాభం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇటీవలి కాలంలో శ్వాసకోశ సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.
ప్రజాప్రతినిధిగా ఆయన విశేష సేవలందించారు. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదం పొందిన ఆయన, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగానూ ఎన్నికయ్యారు.దివంగత నేతలు ఎన్టీఆర్, చెన్నారెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారు, అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించి తనదైన ముద్ర వేశారు.. 2024 ఎన్నికల ముందు వైఎస్సార్‌సీపీలో చేరారు. కాపు ఉద్యమ నేతగా ముద్రగడకు గుర్తింపు లభించింది. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ముద్రగడ మృతితో పలువురు వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.