లారీని ఢీకొట్టిన కారు..
నలుగురు అక్కడికక్కడే దుర్మరణం!
విశాఖపట్నం:
జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారు జామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆనందపురం - అనకాపల్లి నేషనల్ హైవేపై గండిగుండం సమీపంలో వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి, ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో కారు డ్రైవర్ కూడా ఉన్నారుశుభకార్యానికి వెళ్తుండగా విషాదం ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా వినుకొండ నుంచి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరగబోయే ఒక శుభకార్యానికి హాజర య్యేందుకు వీరంతా కారు లో బయలుదేరారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ప్రయాణి స్తున్నారు ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జ యింది ఎమ్మెల్యే పీఏ పరి స్థితి విషమం కుమారుడు మృతి పల్నాడు జిల్లా నరసరాపుపేట ఎమ్మెల్యే పీఏ (పర్సనల్ అసిస్టెంట్) చంద్రశేఖర్ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం విశాఖ పట్నం లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిలో చంద్రశేఖర్ కుమారుడు కూడా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఈ వార్త తెలియడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి రంగంలోకి దిగిన పోలీసులు
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు కారులో ఇరుక్కు పోయిన మృతదేహాలను ఎంతో శ్రమించి బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు జాతీయ రహదారి పై అతివేగం వల్ల నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం కారణమా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.