జగనన్న 2.0 యాప్ పోస్టర్ ఆవిష్కరణ
మురళీనగర్, జూలై 20
అక్షర చాతుర్య
ఉత్తర నియోజకవర్గం 48వ వార్డు వైసీపీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశం ఆదివారం మురళీనగర్‌లోని ఒక ఫంక్షన్ హాలులో జరిగింది.
జిల్లా పార్టీ అధ్యక్షులు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై దృష్టి సారించి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన జగనన్న 2.0 సూపర్ యాప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యకర్తలు యాప్‌ను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని ఆయన కోరారు.
సీనియర్ నాయకులు బొగ్గు శ్రీను, వార్డు అధ్యక్షులు డోప్ప శ్రీను అధ్యక్షత వహించారు. మాజీ కార్పొరేటర్ అల్లు శంకరరావు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు నీలి రవి, కర్రీ రామారెడ్డి, మార్కెండేయులు, వార్డు నాయకులు రాజాన గంగరాజు, సారిపిల్లి సంతోష్, భూలోకం, పి.అప్పారావు, రుత్తల రాంబాబు, కండిపిల్లి శ్రీను, గెలాక్సీ శ్రీను, జాన్సన్, ఉష, భారతి, పార్వతి, వార్డు కమిటీ, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు.