Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsకేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 26 Jul 2026, 3:17 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 9 💬 0
Andhra Pradesh

కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి

కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి

కేంద్ర విద్యాశాఖ నూతన మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం రోజున అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం మరియు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయగా, ఆ బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(2) ప్రకారం ప్రధాని మోదీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను తక్షణమే ఆమోదించారు. అనంతరం విద్యాశాఖ అదనపు బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి కేటాయిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రిగా కొనసాగుతున్న జోషి.. ఈ అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు.

విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, నిరసనలను అసమ్మతి శక్తులు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే తాను రాజీనామా చేసినట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. కాగా, మంత్రి రాజీనామా మరియు ప్రభుత్వం నుండి లభించిన హామీలతో జంతర్ మంతర్ వద్ద గత 37 రోజులుగా సాగుతున్న విద్యార్థుల నిరసన విరమించబడింది.