Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News › దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా రాజీవ్ జయంతి › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 20 Aug 2026, 3:15 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 24 💬 0
Andhra Pradesh > రాజకీయాలు

దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా రాజీవ్ జయంతి

దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా రాజీవ్ జయంతి

ఇంచార్జ్ కేవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

విశాఖపట్నం: దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేవీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి భారతరత్న రాజీవ్ గాంధీ 82వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా కేవీ సూర్యనారాయణ మాట్లాడుతూ, దేశానికి IT విప్లవం తీసుకువచ్చిన ఘనత, 18 సంవత్సరాల వయసు వారికి ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అనేక సంస్కరణలు రాజీవ్ గాంధీ హయాంలోనే సాధ్యమయ్యాయని కొనియాడారు. అటువంటి దార్శనిక నాయకుడిని కోల్పోవడం దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ జిల్లా చైర్మన్ కొండపల్లి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకులు కస్తూరి వెంకటరావు, మైనార్టీ నాయకులు హరసద్ బాషా, దక్షిణ నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు శ్రీనివాసరావు, మహిళా నాయకురాలు కే. గాయత్రి, సీనియర్ నాయకులు త్రినాధరావు, వార్డ్ అధ్యక్షులు కాకర అప్పారావు, ఈశ్వరావు, షేర్ ఆలీ, వెంకటేష్, వరహాలమ్మ, యూత్ నాయకులు రవి తదితర కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.