Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsయూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 100 💬 0
Andhra Pradesh > రాజకీయాలు

యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ

యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ

విశాఖపట్నం

విశాఖ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సమావేశం జరిగింది, ఈ సందర్బంగా ఏఐసీసీ నుండి వచ్చిన ఎన్నికల పరిశీలకుడు డెనిస్ థామస్ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నం పార్లమెంటరీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికలు జనవరి 26వ తేదీన జరుగుతుందని, జనవరి 7 నుండి అధ్యక్ష ఎన్నికకు జిల్లా పార్టీ కార్యాలయంలో దరఖాస్తు స్వీకరణ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అబ్జర్వర్, ఉత్తరాంధ్ర జోనల్ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ డెనిస్ థామస్ కుమార్ తెలిపారు,

యువజన కాంగ్రెస్ ఎన్నికల దృష్ట్యా బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ప్రారంభించారు, ఆమె మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ యువతకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. రాబోయే యువజన కాంగ్రెస్ ఎన్నికల కోసం ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగిన యువతీ యువకులందరూ ఈ అవకాశాన్నివినియోగించుకోవాలని కోరారు.

అర్హులైన వారందరూ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని, పార్టీ బలోపేతానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నడుం బిగించాలని ప్రియాంక పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాండవ గాయత్రి, యూత్ కాంగ్రెస్ జిల్లా కోఆర్డినేటర్ భరత్, సీనియర్ నాయకుడు కస్తూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.