Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsవిశాఖలో యువకుడి దారుణ హత్య?. › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 293 💬 0
Andhra Pradesh

విశాఖలో యువకుడి దారుణ హత్య?.

విశాఖలో యువకుడి దారుణ హత్య?.

​ఎన్ఏడి జంక్షన్ జనవరి 2
అక్షర చాతుర్య:

నగరంలోని ఎన్ఏడి జంక్షన్ శాంతిపురం సమీపంలో ఓ యువకుడు రక్తమడుగులో పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని దిలీప్‌గా గుర్తించారు.
స్థానికుల కథనం ప్రకారం.. దిలీప్ తన స్నేహితులైన బాలరాజు, రమణలతో కలిసి మద్యం సేవించాడు. అనంతరం వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటికే దిలీప్ తీవ్ర గాయాలతో రక్తమడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఎయిర్పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు. గతంలో ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే తన భర్తను ఎవరో పథకం ప్రకారం హత్య చేశారని దిలీప్ భార్య చంద్రిక ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో జరిగిన గొడవా లేక పాత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.