Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsమధురవాడలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్. › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 58 💬 0
Andhra Pradesh

మధురవాడలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.

మధురవాడలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.

​మధురవాడ: జనవరి 2
అక్షర చాతుర్య

నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పి.ఎం. పాలెం ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం మధురవాడ, కార్ షెడ్, స్టేడియం కూడళ్ల వద్ద ట్రాఫిక్ సి.ఐ. ఎన్. సాయి ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ నిర్వహించారు.
​ముఖ్యంగా హెల్మెట్ లేని ప్రయాణం, మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకపోవడం, త్రిబుల్ రైడింగ్‌పై దృష్టి సారించిన పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
​ఈ సందర్భంగా సి.ఐ.నెల్లి,సాయి మాట్లాడుతూ.. నగరంలో ప్రమాదాల నివారణకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, జిగ్ జాగ్ డ్రైవింగ్, యువత చేసే బైక్ రేసింగ్‌ల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.