పార్టీ శ్రేణుల సంబరాలు
శనివారం, జనవరి 3
ఆంధ్ర రాష్ట్రంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ లకు నూతన అధ్యక్షులను ఏ ఐ సి సి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో పార్టీ హైకమాండ్ నియమించింది ఈ మేరకు పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కె సి వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు సంఘటన్ సృజన అభియాన్ లో భాగంగా ఈ నియామకాలు చేపట్టినట్టు పేర్కొన్నాయి.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్న నేతలకు ఈ భాద్యతలు అప్పగించింది. విశాఖ జిల్లా డి సి సి అధ్యక్షునిగా తిరిగి అడ్డాల వెంకట వర్మ రాజు( హాసిని వర్మ ) రెండవసారి అద్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఉత్కంఠ భరితంగా ఓటింగ్ సరళిలో అభ్యర్థులను ఎంపిక చేసిన పరిశీలకుల బృందం తుది నివేదికను పార్టీ హై కమాండ్ కు అందజేసింది ..పి సి సి అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల జిల్లా అధ్యక్షుల తుది జాబితాను పరిశీలన చేసి హై కమాండ్ కు పంపినట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు తుది జాబితా విడుదల చేసారుఈ నేపథ్యంలో పార్టీ మరోసారి వర్మ రాజుకు అవకాశం ఇచ్చింది ..అలాగే మొత్తం ఎపి రాష్ట్రంలో 25 జిల్లాలకు అద్యక్షులని నియమించింది పార్టీ అధిష్టానం .