Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsవర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 42 💬 0
Andhra Pradesh

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం

వారం రోజులు పాటు ప్రత్యేకంగా నిర్వహణ

విశాఖపట్నం . జనవరి 28

రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తుందని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి
(ఎన్ ఎ జె). గంట్ల శ్రీనుబాబు..విశాఖ జిల్లా అధ్యక్షులు పి నారాయణలు తెలిపారు.. బుధవారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీవో హోం లో 2026 వార్షిక సంవత్సరానికి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని
గంట్ల శ్రీనుబాబు చేతుల మీదుగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నూతన సభ్యత్వాలు.. రెన్యువల్సు ప్రక్రియను వారం రోజులు పాటు నిర్వహిస్తామన్నారు. గత ఏడాది 600 మంది జర్నలిస్టులు తమ యూనియన్ లో సభ్యులుగా చేరినట్లు వీరు చెప్పారు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధన ల మేరకు ఫెడరేషన్.. బ్రాడ్ కాస్ట్.. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ల జర్నలిస్టులకు తమ యూనియన్ ద్వారా చేయూతను అందిస్తామన్నారు.. ఈ ఏడాది అర్హులైనవారందరికీ అక్రిడేషన్లు జారీ చేయాలని,, ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని, ఇతర రాష్ట్రాలు మాదిరిగా సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ పథకం అమలు చేయాలని,, ప్రమాద బీమా పునరుద్ధరణ.. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు వాటి అమలకు వివిధ కమిటీలను కూడా తక్షణమే నియమించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

జర్నలిస్టుల సంక్షేమంతో పాటు అన్ని రకాల పండుగల నిర్వహణ..
అలాగే వన సమారాధన.. విద్యా వైద్యానికి కూడా తమ పరిధి మేరకు కృషి చేస్తున్నట్లు వీరు చెప్పారు. యూనియన్ ద్వారా వర్కింగ్ జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామన్నారు… ప్రతి ఒక్క సభ్యుడు యూనియన్ నియమిబంధనలు పాటించాలని.. అలా కాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే ఎనిమిది మందితో కూడిన క్రమశిక్షణ సంఘం కు సిఫార్సు చేయడం జరుగుతుంది అన్నారు..
అనంతరం నూతన.. రెన్యువల్స్ కార్డులను సభ్యులకు వీరి చేతుల మీదుగా అందజేశారు..

ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ విశాఖ జిల్లాకార్యదర్శి జి. శ్రీనివాస రావు ..ఏపీబీజేఏ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ. సాంబశివరావు, ఉపాధ్యక్షులు బి. శివప్రసాద్, జాయింట్ సెక్రటరీ లు నగేష్, శ్రీనివాసనాయుడు, కిషోర్, మధురవాడ ఆనంద్,స్మాల్ పేపర్స్ అసోసియేషన్ కార్యదర్శి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు బొబ్బర ప్రసాద్, కె. వి. శర్మ,చక్రి తదితరులు పాల్గొన్నారు..