Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsఆర్టస్ కాలేజీలో అంబేద్కర్ కు ఘన నివాళి › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 884 💬 0
Andhra Pradesh > విద్య

ఆర్టస్ కాలేజీలో అంబేద్కర్ కు ఘన నివాళి

ఆర్టస్ కాలేజీలో అంబేద్కర్ కు ఘన నివాళి

వేపగుంట, ఏప్రిల్ 14

భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి బహుముఖ ప్రజ్ఞాశీలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఆర్టస్ నర్సింగ్ కాలేజీ లో సంస్థ డైరెక్టర్ & కరస్పాండెంట్ తాకసి స్వాతి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.

కార్యక్రమంలో కాలేజీ సిబ్బంది ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ & కరస్పాండెంట్ స్వాతి మాట్లాడుతూ…

అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికో నాయకుడు కాదని ప్రపంచ మేధావి భారతదేశంలో అనేక సంస్కరణలు చేసిన వ్యక్తి అని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో అనేక దేశాలు రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ప్రపంచంలోనే అత్యంత రాజ్యాంగాన్ని తయారు చేసి అందరికీ సమానత్వం అందరికీ స్వేచ్ఛ కలగాలని ఉద్దేశంతోనే రాజ్యాంగాన్ని నిర్మించారని తెలిపారు. కుల వివక్షను ఎదుర్కొన్న అపార విద్యాబ్యాసంతో ఉన్నత స్థానానికి ఆయన ఎదిగారు అన్నారు.బాబా సాహెబ్ ఆశయ సాధనకు అందరూ తమ వంతు ప్రయత్నాలు చేయాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ గ్రేసినంద్, హెన్నా, అదితి,హరాదని, రేవతి శ్రావణి పూర్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.