ఘనంగా కళాకారుల క్రికెట్ టోర్నీ ప్రారంభం
పలు ప్రాంతాల నుంచి హాజరైన కళాకారులు..
జ్ఞానాపురం ఏప్రిల్ 24..
అక్షర చాతుర్య
క్రీడలు సత్ప్రవర్తన, కీర్తి ప్రతిష్టలను పెంపొందిస్తాయని పైడా విద్యాసంస్థల చైర్మన్ పైడా కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. సత్గీత్, విష్ణు పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కళాకారుల ఫ్రెండ్షిప్ కప్ క్రికెట్ పోటీలను శుక్రవారం జ్ఞానాపురం మైదానంలో ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాకారులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. భూమాత మేనేజింగ్ డైరెక్టర్ తాళ్లూరి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ అంకితభావం, పట్టుదల ఏ రంగంలోనైనా ప్రగతికి పెట్టుబడిగా పేర్కొన్నారు. ఐదేళ్లుగా ఉత్తరాంధ్ర కళాకారులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న సినీ డైరెక్టర్ కుమార్, ఆర్. గణేష్ లను అభినందించారు.
విశాఖ జిల్లా కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు ..జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కళలు, క్రీడలు సమైక్యత నైపుణ్యాన్ని చాటిచెబుతాయి అన్నారు. మాజీ డిప్యూటీ మేయరు దాడి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖలో బహుముఖ ప్రతిభకు కొదవ లేదన్నారు. లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్ వి. భాస్కరాచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ కొరియోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్. నాగరాజు పట్నాయక్
అనకాపల్లి ప్రశాంతి నికేతన్ డైరెక్టర్ డి.చంద్రశేఖర్,బివి రామారావు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ బి.వి.రామ్,యువ సంఘ సేవకుడు ఆడారి కిషోర్ కుమార్, ధనుంజయ్ ఆర్ట్స్ ధనుంజయ్, కే.జనార్ధన్, మాజీ పోలీసు ఉన్నతాధికారి ఖాన్, నిర్వాహకులుఆర్.యాద్ కుమార్, ఆర్. గణేష్,భాను తదితరులు పాల్గొన్నారు. తొలుత ముఖ్యఅతిథి పోటీల ట్రాఫిలను ఆవిష్కరించారు. అనంతరం తాళ్లూరి పూర్ణచంద్రరావు, పైడా కృష్ణ ప్రసాదులు బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీనియర్ కళాకారులు స్వర్గీయ పిసిరథో, బాదంగీర్ సాయి, నాంచారయ్య చిత్రపటాలకు నివాళులు అర్పించారు. మూడు రోజులు పాటు జరిగే ఈ పోటీల్లో ఉత్తరాంద్ర కు చెందిన వివిధ కళా సంస్థలకు చెందిన 12 జట్లు పోటీ పడుతున్నాయి