Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsతమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి… › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 82 💬 0
రాజకీయాలు

తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి విజయ్

తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘…                               సీఎం గా దళపతి విజయ్

చెన్నై: మే 08
అక్షర చాతుర్య

తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్‌కు స్పష్టమైన మెజార్టీ లభించింది.

సంఖ్యాబలం ఎలా చేరింది
టీవీకేకు 107, వీసీకేకు 2, సీపీఐకు 2, సీపీఎంకు 2, కాంగ్రెస్‌కు 5 స్థానాలు కలిపి మొత్తం బలం 118కి చేరింది. విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉండగా, మెజార్టీకి అవసరమైన 11 మంది అదనపు సభ్యుల మద్దతు లభించింది.

గవర్నర్‌తో భేటీకి సిద్ధం
మెజార్టీ ఎమ్మెల్యేల జాబితాతో విజయ్ ఈ రోజు సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవనున్నారు. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయిన విజయ్‌కు గతంలో సంఖ్యాబలం తక్కువగా ఉందని గవర్నర్ సూచించారు.

వామపక్షాలతో విజయవంతమైన చర్చలు
సంఖ్యాబలం కోసం టీవీకే జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వామపక్ష నేతలతో చర్చలు జరిపారు. నాలుగు రోజుల క్రితం లేఖ ద్వారా మద్దతు కోరిన అనంతరం నేరుగా సమావేశమయ్యారు. చర్చలు సఫలం కావడంతో వీసీకే, సీపీఐ, సీపీఎం షరతులు లేకుండా మద్దతు ప్రకటించాయి. డీఎంకే మిత్రపక్షాలు అయినప్పటికీ చివరికి విజయ్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మంత్రి పదవుల ఆఫర్
ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వీసీకే, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో మంత్రి పదవి, కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ ఆఫర్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.

టీవీకే శ్రేణుల సంబరాలు
శుక్రవారం సాయంత్రం చెన్నైలోని విజయ్ నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని 'టీవీకే, టీవీకే' నినాదాలతో హోరెత్తించారు. విజయ్ తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.