Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsవిశాఖ నవవధువు అనుమానాస్పద మృతి ! › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 113 💬 0
Andhra Pradesh > Telangana

విశాఖ నవవధువు అనుమానాస్పద మృతి !

విశాఖ నవవధువు అనుమానాస్పద మృతి !

హైదరాబాద్‌లో విషాదం ..

భర్త ఆత్మహత్య అంటే, బంధువులు హత్యారోపణ

మధురవాడ/హైదరాబాద్, అక్టోబర్ 23

విశాఖపట్నం మధురవాడకు చెందిన నవవధువు కణితి సుమిత్ర (24) హైదరాబాద్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

వాంబేకాలనీకి చెందిన సుమిత్రకు కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేటు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న స్వయంవరపు మహేశ్‌తో ఈ ఏడాది మార్చి 15న వివాహమైంది. పెళ్లైన ఏడు నెలలకే ఈ దారుణం చోటుచేసుకోవడంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఘటన వివరాలు ఇలా…

గురువారం రాత్రి 9 గంటల సమయంలో కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలోని తమ నివాసంలో సుమిత్ర ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త మహేశ్ పోలీసులకు తెలిపాడు. వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అయితే మృతురాలి బంధువులు మాత్రం భర్త వాదనను తీవ్రంగా ఖండిస్తున్నారు. పెళ్లైన నాటి నుంచి అదనపు కట్నం కోసం మహేశ్ కుటుంబ సభ్యులు సుమిత్రను వేధిస్తున్నారని, పథకం ప్రకారం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

పోలీసుల దర్యాప్తు

సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సుమిత్ర తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. భర్త మహేశ్‌తో పాటు అత్తమామలను విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.

పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాల తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు. కొద్ది నెలల క్రితమే వైభవంగా పెళ్లి జరగగా, ఇంతలోనే నవవధువు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.