…వైసీపీ బీసీ విభాగం…
విశాఖపట్నం, మే 26
అక్షర చాతుర్య
మత్స్యకారులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు సనపల రవీంద్ర భరత్ ధ్వజమెత్తారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
1.30 లక్షల కుటుంబాలకు రూ.261.59 కోట్లు విడుదల చేశామని చెబుతున్నా ఇప్పటికీ చాలామంది ఖాతాల్లో జమకాలేదని ఆరోపించారు. పెన్షన్, 300 యూనిట్ల కరెంట్ నిబంధనలతో అర్హుల పేర్లు తొలగించారన్నారు.
ఏప్రిల్ 15 నుంచి వేట నిషేధం ఉన్నా మే చివరిలో నిధులివ్వడంతో జాలర్లు అప్పులపాలయ్యారని విమర్శించారు. విశాఖ హార్బర్‌లో 30 వేలు మంది వేటపై ఆధారపడితే జిల్లాలో 13 వేల మందినే లబ్ధిదారులుగా చూపడం దారుణమన్నారు.
వారం రోజుల్లో అందరికీ నగదు జమ చేయాలని, లేకుంటే మంత్రి అచ్చెం నాయుడిని అడ్డుకుంటామని హెచ్చరించారు. వైసీపీ హయాంలో మత్స్యకారులకు రాజ్యసభ, మంత్రి పదవులు ఇచ్చి హార్బర్లు నిర్మించామని గుర్తుచేశారు.
సమావేశంలో ఉమ్మిడి కళ్యాణ్, పోతిబంతి హరికృష్ణ, బొండాడ వెంకటరమణ, సాగర్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.