Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News › విశాఖ హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:38 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 95 💬 0
Andhra Pradesh

విశాఖ హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం

విశాఖ హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం

విశాఖపట్నం

లొడగలవానిపాలెం హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పచ్చి కోళ్ల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వ్యాన్ అదుపు తప్పి ఆగి ఉన్న రెండు వాహనాలను ఢీకొట్టింది.

ప్రమాద వివరాలు:

  • ఈ ఘటనలో డాన్స్ మాస్టర్ పండుకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
  • మరో ముగ్గురికి స్వల్ప గాయాలు కావడంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
  • తగరపువలస ఉత్సవాల నుంచి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది.

కారణం, పోలీసుల చర్యలు :

  • నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
  • ప్రమాదానికి గురైన మూడు వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
  • ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పరిస్థితిని సాధారణం చేశారు.