By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి విజయ్
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > రాజకీయాలు > తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి విజయ్
రాజకీయాలు

తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి విజయ్

Anandkumar Vankara
Last updated: July 22, 2026 4:38 pm
Anandkumar Vankara
1 week ago
Share
తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి విజయ్
SHARE

టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం

చెన్నై: మే 08
అక్షర చాతుర్య

తమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు చోటుచేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. సీపీఐ, సీపీఎం, వీసీకే మద్దతు ప్రకటించడంతో విజయ్‌కు స్పష్టమైన మెజార్టీ లభించింది.

సంఖ్యాబలం ఎలా చేరింది
టీవీకేకు 107, వీసీకేకు 2, సీపీఐకు 2, సీపీఎంకు 2, కాంగ్రెస్‌కు 5 స్థానాలు కలిపి మొత్తం బలం 118కి చేరింది. విజయ్ రెండు చోట్ల గెలవడంతో ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉండగా, మెజార్టీకి అవసరమైన 11 మంది అదనపు సభ్యుల మద్దతు లభించింది.

గవర్నర్‌తో భేటీకి సిద్ధం
మెజార్టీ ఎమ్మెల్యేల జాబితాతో విజయ్ ఈ రోజు సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలవనున్నారు. ఇప్పటికే రెండుసార్లు భేటీ అయిన విజయ్‌కు గతంలో సంఖ్యాబలం తక్కువగా ఉందని గవర్నర్ సూచించారు.

వామపక్షాలతో విజయవంతమైన చర్చలు
సంఖ్యాబలం కోసం టీవీకే జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వామపక్ష నేతలతో చర్చలు జరిపారు. నాలుగు రోజుల క్రితం లేఖ ద్వారా మద్దతు కోరిన అనంతరం నేరుగా సమావేశమయ్యారు. చర్చలు సఫలం కావడంతో వీసీకే, సీపీఐ, సీపీఎం షరతులు లేకుండా మద్దతు ప్రకటించాయి. డీఎంకే మిత్రపక్షాలు అయినప్పటికీ చివరికి విజయ్‌కే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

మంత్రి పదవుల ఆఫర్
ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన వీసీకే, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో మంత్రి పదవి, కాంగ్రెస్‌కు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని విజయ్ ఆఫర్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో నాలుగు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది.

టీవీకే శ్రేణుల సంబరాలు
శుక్రవారం సాయంత్రం చెన్నైలోని విజయ్ నివాసం వద్ద టీవీకే కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని ‘టీవీకే, టీవీకే’ నినాదాలతో హోరెత్తించారు. విజయ్ తదుపరి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనుండడంతో శ్రేణుల్లో సంబరాలు అంబరాన్ని అంటాయి.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ
గ్యాస్ బాంబు పేలింది..!
రెండవ సారి డీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన అడ్డాల వర్మ రాజు ( హాసిని వర్మ)
ముద్రగడ కన్నుమూత !
ఏయూ శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన ఉత్తరాంధ్ర విద్యార్థి సేన
Share This Article
Facebook Email Print
Previous Article విశాఖ హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం విశాఖ హైవేపై అర్ధరాత్రి ఘోర ప్రమాదం
Next Article 7d62e988-cc56-4d1f-b3d2-d32f86e35919 గ్యాస్ బాంబు పేలింది..!
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?