By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: గ్యాస్ బాంబు పేలింది..!
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > ఆర్థిక వ్యవస్థ > గ్యాస్ బాంబు పేలింది..!
Andhra Pradeshఆర్థిక వ్యవస్థరాజకీయాలు

గ్యాస్ బాంబు పేలింది..!

Anandkumar Vankara
Last updated: July 22, 2026 4:38 pm
Anandkumar Vankara
1 week ago
Share
7d62e988-cc56-4d1f-b3d2-d32f86e35919
SHARE

మరోసారి ఎల్పీజీ ధరల మోత..

సామాన్యుడి నడ్డి విరుస్తున్న భారం

విశాఖ, జూన్ 7
అక్షర చాతుర్య ప్రత్యేక ప్రతినిధి

దేశవ్యాప్తంగా మరోసారి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగి సామాన్య ప్రజల గుండెల్లో గుబులు రేపాయి. 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.29 పెంపును చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించడంతో, ఇప్పటివరకు రూ.913గా ఉన్న సిలిండర్ ధర రూ.942కు చేరుకుంది. ఆదివారం (జూన్ 7) నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి.

ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు ఇది మరో గట్టి దెబ్బగా మారింది. కూరగాయల ధరలు, విద్యుత్ చార్జీలు, పెట్రోల్, డీజిల్ భారం నుంచి కోలుకోకముందే వంటగ్యాస్ ధరలు మళ్లీ మండిపోవడం కుటుంబ బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఎల్పీజీ ధరల పెరుగుదల, పశ్చిమాసియా ఉద్రిక్తతలే ఈ పెంపుకు కారణమని చమురు సంస్థలు చెబుతున్నప్పటికీ, ప్రజల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత మార్చిలోనే రూ.60 పెంచిన ప్రభుత్వం, కేవలం మూడు నెలల వ్యవధిలో మరోసారి ధర పెంచడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

“సబ్సిడీ పేరుతో మాటలు.. కానీ భారం మాత్రం ప్రజలపై!” అంటూ సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న మధ్యతరగతి ప్రజలకు ప్రతి నెల గ్యాస్ బిల్లు అదనపు మోతగా మారిందని గృహిణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల సహనాన్ని పరీక్షించేలా వరుస ధరల పెంపులు కొనసాగితే, రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేకత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. “ధరల నియంత్రణపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, సామాన్యుడి వంటింట్లో మంటలు కాకుండా ఆగ్రహ జ్వాలలు రగిలే పరిస్థితి వస్తుంది” అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి, గ్యాస్ సిలిండర్ ధరలపై ఉపశమనం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

మత్స్యకారుల గల్లంతుపై వైసీపీ ఆందోళన
నిజ నిర్ధారణ కమిటీపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే !
తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి విజయ్
చర్చి పాస్టర్ ఇంట్లో భారీ నగదు స్వాధీనం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం సమీక్ష సమావేశం
Share This Article
Facebook Email Print
Previous Article తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి విజయ్ తమిళ పీఠంపై ‘ తుపాకీ ‘… సీఎం గా దళపతి విజయ్
Next Article గూగుల్ తెచ్చిన ఘనత మాది..గన్ కల్చర్ మీది ! గూగుల్ తెచ్చిన ఘనత మాది..గన్ కల్చర్ మీది !
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?