Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsమత్స్యకారుల గల్లంతుపై వైసీపీ ఆందోళన › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 22 Jul 2026, 4:37 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 9 💬 0
Andhra Pradesh > రాజకీయాలు

మత్స్యకారుల గల్లంతుపై వైసీపీ ఆందోళన

మత్స్యకారుల గల్లంతుపై వైసీపీ ఆందోళన

24 గంటలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం…

వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు ఆందోళన

విశాఖపట్నం,జూలై 5
అక్షర చాతుర్య

విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల ఘటనపై వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగి 24 గంటలు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ చూపకపోవడం విచారకరమని పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె. రాజు అన్నారు.

ఆదివారం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లోని మత్స్యశాఖ కార్యాలయం వద్దకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారుల కష్టసుఖాలన్నీ సముద్రంతో ముడిపడి ఉంటాయని తెలిపారు.

"యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగించి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీని వీలైనంత త్వరగా తెలియజేయాలి. బాధిత కుటుంబాలకు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుంది" అని కె.కె. రాజు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్, దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు తూర్పు నియోజకవర్గ పరిశీలకులు పేడాడ రమణికుమారి పాల్గొన్నారు.

పార్టీ ముఖ్య నాయకులు కట్టుమూరి సతీష్, కొండ రాజీవ్ గాంధీ, మంచం నాగమల్లేశ్వరి, పేర్ల విజయ చంద్ర, చెన్న జానకిరాము, జీలకర్ర నాగేంద్ర, ఎం. సునీల్, శ్రీదేవి వర్మ, బోని శివ రామకృష్ణ, దేవరకొండ మార్కండేయులు, సనపల రవీంద్ర భరత్, ఉమ్మడి కళ్యాణ, బొట్టేటి కిరణ్, గొందేసి శ్రీనివాస్ రెడ్డి, సతీష్, పార్వతి, హరికృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.