Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu Newsఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 in @ 📱 WhatsApp
Date of Publish : 27 Jul 2026, 11:22 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 28 💬 0
Andhra Pradesh > రాజకీయాలు

ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం..

ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం..

అమరావతి, జూలై 27
అక్షర చాతుర్య

సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రకటించారు.

ఈ మేరకు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సోమవారం ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించింది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్యులపై భారం తగ్గించేందుకే కూటమి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని పవన్ పేర్కొన్నారు.

ఎక్కడ, ఎంత ధరకు?

పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 130 రైతుబజార్లు, 500 మంది రైస్ మిల్లర్ల ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు జరుగుతాయి.

  • బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం: కేజీ రూ.52
  • గ్రేడ్-1 పచ్చి బియ్యం (రా రైస్): కేజీ రూ.50

ప్రభుత్వ ఉద్దేశం
"ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి, పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకే ఈ నిర్ణయం. మిల్లర్లతో అత్యవసర సమావేశం నిర్వహించి, మార్కెట్ ధరలను సమీక్షించిన తర్వాతే ఈ ధరలు నిర్ణయించాం" అని పవన్ కల్యాణ్ తన పోస్టులో పేర్కొన్నారు.

పౌర సరఫరాల శాఖ తీసుకున్న ఈ పాలనాపరమైన నిర్ణయం వల్ల సామాన్యుల ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని, కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ నిర్ణయంతో ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.