Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News › వరదకు బెదరని ఇల్లు.. › e-Paper Clip Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
Share: f 𝕏 ✉ ✈ in @ 📱 WhatsApp
Date of Publish : 29 Aug 2026, 8:15 pm  |  Posted by : ANANDKUMAR VANKARA
👁 13 💬 0
Andhra Pradesh

వరదకు బెదరని ఇల్లు..

వరదకు బెదరని ఇల్లు..

నేపాల్‌లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో పెద్ద ఎత్తున విధ్వంసం, భారీగా ప్రాణనష్టం సంభవించడం తెల్సిందే. ఒక్కసారిగా వచ్చి పడిన మెరుపు వరద అన్నిటినీ చుట్టేస్తూ నాశనం చేసుకుంటూ వెళ్తుండగా నేపాల్‌-భూటాన్‌ సరిహద్దులోని ఓ నివాసం మాత్రం చెక్కుచెదరలేదు.

అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతోంది.

పెను వేగంతో దూసుకొచ్చిన వరద ఆ ఇంటి చుట్టుపక్కల ప్రాంతాన్ని ముంచెత్తుతూ అక్కడున్న నిర్మాణాలన్నిటినీ నాశనం చేసేసింది. చుట్టుపక్కల భవనాలు కొట్టుకుపోగా ఆ ఇల్లు మాత్రం తట్టుకుని నిలబడగలిగింది. ఆ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. అందులోని ఆ ముగ్గురికీ ఏమైందంటూ చాలామంది సోషల్‌ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఓ నెటిజన్‌ మాత్రం వారు సురక్షితంగానే ఉన్నారని ధ్రువీకరించారు.

ఈ మేరకు ఒక వీడియోను షేర్‌ చేయడంతో అందరూ స్థిమితపడ్డారు. ఆ ఇల్లు అంత పటిష్టంగా ఉండటంపైనా ఆన్‌లైన్‌లో చర్చ జరిగింది. చుట్టూ ఉన్న భవనాలు, వ్యర్థాలు ప్రవాహంలో కొట్టుకుపోయినప్పటికీ, ఆ నిర్మాణం ఎలా తట్టుకుని నిలబడిందంటూ నెటిజన్లు ఆసక్తిగా ప్రశ్నించారు. ఒక యూజర్‌ అయితే.. ఆ ఇంటిని కట్టిన వ్యక్తికి నేపాల్‌ రత్న మాన్‌ పదవి పురస్కారం ఇవ్వాలంటూ వ్యాఖ్యానించారు. ఆ ఇంటి అసాధారణమైన నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించారు. నిజంగా ఇది చెప్పుకోదగ్గ విషయమే ఏదో దైవ శక్తి వారిని వారి ఇంటిని కాపాడింది అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట ...