మధురవాడ, ఏప్రిల్ 26:
అక్షర చాతుర్య
విశాఖ మధురవాడ పరిధిలోని ఎండాడ రాజీవ్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న సంధ్య (24) ఆదివారం తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది.
ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంధ్య పీఎం పాలెం పోస్టాఫీసులో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఆదివారం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆరిలోవ ఎస్‌ఐ కృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది.