రాబోయే జీవీఎంసీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి..
:: డీసీసీ అధ్యక్షులు హాసిని వర్మ ::
విశాఖపట్నం,
అక్షర చాతుర్య
విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ 37 వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కాకర అప్పారావు ఎంపికయ్యారు..
ఈ సందర్భంగా కాకర అప్పారావు మొదటగా తనకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వై ఎస్ షర్మిల రెడ్డికి , జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు (హాసిని వర్మ) కు,దక్షణ నియోజకవర్గం ఇంచార్జి కే వి సూర్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీకి, వార్డ్ అభివృద్ధికి నాయొక్క సేవలు కొనసాగిస్తానని వార్డులో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నాకు సహాయ సహకారాలు అందిస్తున్న విశాఖ జిల్లా నాయకులకు కృతజ్ఞతలు, తెలియ చేసుకొంటున్నాను, అన్నారు.
నా నియామక కార్యక్రమం లో పాల్గొని నాకు శుభాకాంక్షలు అందచేసిన పీ సి సి కార్యదర్శి గాధం మహేష్, భీమిలి ఇన్చార్జి సవరవిల్లి రామకృష్ణ, తూర్పు ఇంచార్జి ప్రియాంక, మహిళ నాయకురాలు గాయత్రి , ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌతమ్, ప్రధాన కార్యదర్శి ఆనందకుమార్ ఇతర నాయకులు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే వార్డ్ ప్రజలందరకి ఎల్లప్పుడూ అందుబాటులో వుంటానని కాకర అప్పారావు వాగ్దానం చేస్తున్నాను అన్నారు.
