ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
వేపగుంట, ఆగస్టు 15
అక్షర చాతుర్య
ఆర్టస్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రాంగణంలో 80వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం నాడు ఘనంగా నిర్వహించారు.
కాలేజీ డైరెక్టర్ మరియు కరెస్పాండెంట్ తాకసి స్వాతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. వైద్య రంగంలో నర్సింగ్ విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైనదని, క్రమశిక్షణ, సేవాభావంతో సమాజానికి సేవలు అందించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ గ్రేసి నందు, అధ్యాపక బృందం, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపన అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
