By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: స్టీల్ ప్లాంట్ మృతులకు రూ. కోటి పరిహారం ప్రకటించాలి
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > రాజకీయాలు > స్టీల్ ప్లాంట్ మృతులకు రూ. కోటి పరిహారం ప్రకటించాలి
Andhra Pradeshరాజకీయాలు

స్టీల్ ప్లాంట్ మృతులకు రూ. కోటి పరిహారం ప్రకటించాలి

Anandkumar Vankara
Last updated: July 22, 2026 4:38 pm
Anandkumar Vankara
1 week ago
Share
స్టీల్ ప్లాంట్ మృతులకు రూ. కోటి పరిహారం ప్రకటించాలి
SHARE

ఎల్జి పాలిమర్స్ ఘటనలో జగన్ ఇచ్చినట్టే ఇవ్వాలి ..

వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్..

విశాఖపట్నం , అక్షర చాతుర్య
జూన్ 13

ఎల్జి పాలిమర్స్ ఘటనలో మృతుల కుటుంబాలకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రూ. కోటి నష్ట పరిహారం అందజేసిన విధంగానే, స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కూడా రూ. కోటి పరిహారం ప్రకటించాలని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ డిమాండ్ చేశారు.

శనివారం మద్దిలపాలెంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చరిత్రలో ఎక్కడా ఇలాంటి భారీ పరిహారం ఇవ్వలేదని తెలిపారు. స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలకు మాజీ సీఎం జగన్ తగిన ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు.

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కార్మిక సంఘాలను కించపరిచేలా మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు. స్టీల్ ప్లాంట్ అంశంపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ఎల్జి పాలిమర్స్ ఘటనలో ఎంఎన్‌సి కంపెనీ ప్రతినిధులను వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపిన చరిత్ర తమదని ఆల్ఫా కృష్ణ చెప్పారు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తన స్థాయికి తగ్గట్టు మాట్లాడటం లేదని, ఆమె పనితీరు రాజ్యాంగబద్ధంగా లేదని ఆరోపించారు.

తమ పార్టీ అధినేత జగన్ బయటకు వస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించిన ఆయన, కమ్యూనిస్ట్ నేతలను కాల్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. కార్పొరేట్ వర్గాలకు రూ. 99 పైసలకే భూములు కట్టబెట్టడాన్ని ‘సంపద సృష్టి’ అంటారా అని నిలదీశారు.

మీడియా సమక్షంలో హోం మంత్రి అనిత బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలకు చేసిన మంచిపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేసిన ఆల్ఫా కృష్ణ, అనిత తీరు మార్చుకోకపోతే ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పనిచేసే తమను ప్రభుత్వం బెదిరిస్తే భయపడేది లేదన్నారు.

వైఎస్. జగన్ ఆలోచనా విధానమే రాష్ట్ర అభివృద్ధికి శరణ్యమని, ప్రజలు మళ్లీ వైసీపీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ఫెడరేషన్ లక్ష్యం
మధురవాడలో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.
ఏపీలో షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇవ్వనుందా ?
నిబంధనలు గాలికేనా… !
విశాఖలో వైభవంగా హనుమాన్ శోభా యాత్ర
Share This Article
Facebook Email Print
Previous Article 54b32e64-12c1-443c-8abf-ca3ab3f902b0 విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం – 8 మంది కార్మికులు మృతి
Next Article జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఉత్తర్వులు తక్షణం జారీ చేయండి – కలెక్టర్ ఆదేశం జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఉత్తర్వులు తక్షణం జారీ చేయండి – కలెక్టర్ ఆదేశం
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?