విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. స్టీల్‌ప్లాంట్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ప్రమాదం సంభవించింది. మంటలను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో కార్మికులు, ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి.ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.ప్రస్తుత పరిస్థితి, సహయక చర్యలను ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు.అన్ని శాఖల సమన్వయంతో సహయక చర్యలు చేపట్టాలని ఆదేశం జారీ.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని ప్రమాదంపై స్పందించిన హోం మంత్రి అనిత.
విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడిన మంత్రి.
స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి వివరాలు ఆరా తీసిన మంత్రి.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి ఆదేశం.
ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం.
విజయనగరం పర్యటనలో హోం మంత్రి, స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ప్రమాద ఘటనా స్థలానికి బయలుదేరిన మంత్రి.
ఎప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి, అధికారులకు పలు సూచనలు చేస్తున్న హోం మంత్రి.
