54 వార్డులో కేకే కటింగ్ చేసి, పండ్లు పంపిణీ చేసిన వార్డు అధ్యక్షులు కుట్ట కార్తీక్..
మర్రిపాలెం, ఏప్రిల్ 20
అక్షర చాతుర్య
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సోమవారంనాడు ఏప్రిల్ 20, 2026న ఘనంగా జరిగాయి.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమాలు చేశారు.
పుట్టినరోజు సందర్భంగా విశాఖ జిల్లా 54 వార్డు జ్యోతినగర్ హైవే వద్ద వార్డు ప్రెసిడెంట్ కుట్ట కార్తీక్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కేక్ కటింగ్ చేసి మజ్జిక పంపిణీ చేశారు. అనంతరం పళ్ళు పంపిణీ చేసి తమ ప్రియతమ నేత సీఎం చంద్రబాబు పై తమ అభిమానాన్ని చాటుకున్న నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని భగవంతునికి పూజలు చేశారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డ్ యువత అధ్యక్షులు అవనపు శ్రీనివాస్, వార్డ్ సెక్రటరీ ఉప్పాడ శేఖర్, వార్డ్ క్లస్టర్ జగదీష్, జె.జె కుమార్, శ్రీధర్, అచ్యుతాంబ కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం సందర్భంగా టీడీపీ నేతలు రాష్ట్రంలో పలుచోట్ల అన్నదానాలు, పారిశుధ్య కార్మికులకు బట్టల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
గ్రామ స్థాయి నుంచి రాజధాని వరకు ప్రతిచోటా కేక్ కటింగ్‌లతో పాటు పేదలకు పండ్లు, మిఠాయిల పంపిణీ వంటి ఇతర సేవా కార్యక్రమాలను నాయకులు స్వచ్ఛందంగా నిర్వహించారు..
