By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: దేవుడు నా ఆకలి కేక విన్నాడు..నేడు అన్నదాతగా మార్చాడు. !
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > రాజకీయాలు > దేవుడు నా ఆకలి కేక విన్నాడు..నేడు అన్నదాతగా మార్చాడు. !
Andhra Pradeshరాజకీయాలు

దేవుడు నా ఆకలి కేక విన్నాడు..నేడు అన్నదాతగా మార్చాడు. !

Anandkumar Vankara
Last updated: July 22, 2026 4:38 pm
Anandkumar Vankara
1 week ago
Share
దేవుడు నా ఆకలి కేక విన్నాడు..నేడు అన్నదాతగా మార్చాడు. !
SHARE

రాజకీయ పునర్జన్మ నిచ్చింది వైఎస్సార్.. వెన్నంటి నిలిచింది జగనన్న —

ఆల్ఫా కృష్ణ భావోద్వేగం

​విశాఖపట్నం:మే 26
అక్షర చాతుర్య

ఒకప్పుడు రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో ఆకలి బాధలను చూసిన వ్యక్తిగా నేడు అనేకమంది పేదల ఆకలి తీర్చే అన్నదాతగా మారానని ప్రముఖ సామాజిక కార్యకర్త, ‘గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్’ వ్యవస్థాపకులు ఆల్ఫా కృష్ణ పేర్కొన్నారు. తన ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రోజు 50మందికి అన్నదానం చేస్తున్నారు. ఈ అన్నదాన ప్రక్రియను జూన్ 1 నుంచి విస్తృతం చేస్తున్న తరుణంలో డాబాగార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

2015 మార్చి 21న స్థాపించిన గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ ద్వారా పేద, ధనిక అనే తేడా లేకుండా ఆకలితో ఉన్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామన్నారు.
ఈ సందర్బంగా తన జీవిత ప్రయాణాన్ని గుర్తుచేసుకుని ఆల్ఫా కృష్ణ భావోద్వేగానికి లోనయ్యారు.
​ఆ నాటి ఆకలి.. నేటి సంకల్పంగా మారిందన్నారు.

1976 నుండి 1982 వరకు తాను స్వయంగా తీవ్రమైన ఆకలి బాధలను అనుభవించానని ఆల్ఫా కృష్ణ తెలిపారు. 1979లో రైల్వే స్టేషన్ దగ్గర ఆకలితో ఉన్న సమయంలో కొందరు ఫుడ్ ప్యాకెట్లు పంచుతుండటం చూసి.. భవిష్యత్తులో నేను కూడా ఇలా పది మందికి అన్నం పెట్టగలనా అని దేవుడిని ప్రార్థించానన్నారు.
ఆ సంకల్పమే నేడు గోల్డెన్ ఆల్ఫా ఫౌండేషన్ స్థాపనకు పునాది అని పేర్కొన్నారు.తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి దేవుడితో పాటు ముగ్గురు వ్యక్తులు కారణమని కృష్ణ చెప్పారు.

తనకు జన్మనిచ్చింది దేవుడైతే.. రాజకీయంగా పునర్జన్మను ఇచ్చి, జీవితాన్ని ప్రసాదించిన ఆత్మీయ తండ్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డని కొనియాడారు. అలాగే ఉభయ రాష్ట్రాలలో తనను ఒక నాయకుడిగా గుర్తించి, ఎన్నో సందర్భాల్లో తనకు అండగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఎప్పటికీ మరచిపోలేనన్నారు. వైఎస్సార్, జగనన్నల సపోర్ట్ లేకపోతే ఈ రోజు ఆల్ఫా కృష్ణ లేడని ఆయన స్పష్టం చేశారు.
వాళ్లను స్ఫూర్తి గా తీసుకుని నేడు సమాజ సేవకు అంకితమాయ్యనన్నారు.

ఇకపై రోజు 90 మందికి అన్నదానం !

వచ్చే నెల జూన్ 1 నుంచి తన హోటల్ వద్ద ప్రతీ రోజు 90 మంది అన్నార్థులకు చక్కని భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇది కొత్తగా జరిగే ప్రక్రియ కాదని ప్రస్తుతం రోజు 50 మందికి అందిస్తున్న ఆహారం ఇకపై 90 మందికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

మత్స్యకారుల గల్లంతుపై వైసీపీ ఆందోళన
జీవీఎంసీలో 25 మంది ఉద్యోగులకు పదోన్నతులు
విఎంఆర్డిఏలో భారీ అవినీతి !
మత్స్యకారులకు కూటమి వెన్నుపోటు !
గూగుల్ తెచ్చిన ఘనత మాది..గన్ కల్చర్ మీది !
Share This Article
Facebook Email Print
Previous Article మత్స్యకారులకు కూటమి వెన్నుపోటు ! మత్స్యకారులకు కూటమి వెన్నుపోటు !
Next Article c960fe44-1171-4829-9d91-ae4f15c4d4b3 విశాఖలో వైద్యం వికటించి 13 ఏళ్ల బాలిక మృతి.
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?