శివారు ప్రాంతాల ప్రజలకు అందుబాటులో బ్యూటీ షోరూమ్
సుజాతనగర్ లో ఘనంగా ప్రారంభమైన కారా ది బ్యూటీ లాంచ్
జబర్దస్త్ నటులు పల్సర్ బైక్ ఝాన్సీ.. డాన్స్ మాస్టర్ రమేష్
సుజాతనగర్.. పెందుర్తి ..
ఏప్రిల్ 24, అక్షర చాతుర్య
సమాజంలో ప్రస్తుతం..అందరూ ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతంగా ఎదిగేందుకు మహిళలకు అనేక రంగాల్లో అపార ఉపాధి అవకాశాలు ఉన్నాయని
జబర్దస్త్ నటులు పల్సర్ బైక్ ఝాన్సీ(ఆర్ టి సి కండక్టర్,
డాన్స్ మాస్టర్ రమేష్ లు పేర్కొన్నారు… శుక్రవారం ఇక్కడ సుజాతనగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కారా ది బ్యూటీ. ప్రారంభోత్సవాన్ని వీరి చేతుల మీదుగా ప్రారంభించారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరో వచ్చి ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా తమకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో సొంతంగా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటే తద్వారా వారితో పాటు అనేకమంది మహిళలకు కూడా చేయూత అందించడానికి అవకాశం కలుగుతుందన్నారు.. సుజాతనగర్ ప్రాంతం శాటిలైట్ టౌన్ షిప్ గా మారుతుందని కాబట్టి ఇక్కడ ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది అన్నారు..
కారా ది బ్యూటీ లాంచ్ అధినేత ఉప్పలపాటి మహాలక్ష్మి మాట్లాడుతూ పదహారేళ్లుగా తాను అనేక బ్యూటీ సంస్థల్లో పనిచేయడం వల్ల ఈ రంగంలో మంచి అనుభవం సంపాదించడం జరిగిందన్నారు.. అందువల్లే అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతంలో బ్యూటీ షో రూమ్ ఏర్పాటు చేశానన్నారు.. పురుషులు.. మహిళలు ఇలా అందరికీ కూడా ఇక్కడ బ్యూటీ కి సంబంధించిన సామాగ్రి అంతా అందుబాటులో ఉంచామన్నారు.. అలాగే వివిధ రకాల హెయిర్ డ్రెస్సింగ్.. స్కిన్.. అందాలకు సంబంధించిన ట్రీట్మెంట్లు తీసుకోవచ్చునని.. ఫ్యాషన్ కు తగ్గట్లుగా వివిధ రకాల నిపుణులను అందుబాటులో ఉంచామన్నారు..
ఎన్ఏడి కొత్త రోడ్ నుంచి చోడవరం వరకు ఇటువంటి ఆధునిక బ్యూటీ షో రూమ్ లు అందుబాటులో లేవన్నారు.. ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా బ్యూటీ కి సంబంధించిన అన్ని రకాల సామాగ్రిని అందుబాటులో ఉంచామన్నారు.. కావున కారా ది బ్యూటీ లాంచ్ ను ఆదరించాలని కోరారు…
గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ మహిళలు సొంతంగా ఎదిగేందుకు ఇటువంటి బ్యూటీ షో రూమ్ లు ఎంతగానో తోడ్పాటు ను అందిస్తాయన్నారు..
తద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.. యజమాని ఉప్పలపాటి మహాలక్ష్మి ను గంట్ల శ్రీనుబాబు..అభినందించారు అభినందించారు.. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు.. అలాగే
పారిశ్రామికవేత్తలు..అప్పల రెడ్డి.. కందుల రాజశేఖర్.. ప్రసాద్ నాయుడు తదితరులంతా పాల్గొన్నారు..
