విశాఖపట్నం, ఎంవీపీ కాలనీ: ఆగస్టు 28
అక్షర చాతుర్య
ఎంవీపీ కాలనీలోని విశాఖ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి.
అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను పురస్కరించుకుని కార్యాలయంలో సందడి నెలకొంది.
ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఏపీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, మాజీ డీసీసీ అధ్యక్షులు వజపర్తి శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కె.వి. సూర్యనారాయణ, సీనియర్ నాయకులు సోడాదాసి సుధాకర్, కస్తూరి వెంకట్రావు, 28వ వార్డు అధ్యక్షులు గుర్రం కనకరాజు, దల్లి కనకరాజు తదితరులకు ప్రియాంక దండి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ప్రియాంక దండి మాట్లాడుతూ… రాఖీ పౌర్ణమి కేవలం పండుగ మాత్రమే కాదని, మహిళల రక్షణ, గౌరవానికి ఇచ్చే హామీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు, సోదరభావానికి కట్టుబడి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
