By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: ఏపీలో పుర పోరుకు వేళాయే !
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > ఏపీలో పుర పోరుకు వేళాయే !
Andhra Pradesh

ఏపీలో పుర పోరుకు వేళాయే !

Anandkumar Vankara
Last updated: September 10, 2026 11:38 pm
Anandkumar Vankara
4 weeks ago
Share
Auto Draft
SHARE

మూడు దశల్లో స్థానిక సమరం!

అమరావతి, సెప్టెంబరు 10
అక్షర చాతుర్య

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరలేవబోతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం భారీ కసరత్తు మొదలుపెట్టింది. ఈసారి ఎన్నికలను రెండు దశల్లో కాకుండా మూడు దశల్లో నిర్వహించేలా ప్లాన్ రెడీ చేస్తోంది.

తొలి దశలో పురపాలక పోరు…

మొదట మున్సిపల్ ఎన్నికలతోనే సందడి మొదలుకానుంది. కోర్టు కేసులున్న 23 స్థానాలను పక్కనపెట్టి మిగిలిన చోట్ల ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలి విడతలో ఏకంగా 59 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో విజయనగరం నగరపాలక సంస్థతో పాటు మరో 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. అధికారులు ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇప్పటికే ఈ నెల 3వ తేదీన డివిజన్లు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఈ నెల 13 నాటికి పోలింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తి కానుంది. 21వ తేదీ నాటికి ఓటర్ల జాబితా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీల గుర్తింపు ప్రక్రియ, 25వ తేదీ లోగా మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు.

రెండో దశ, మూడో దశ ఇలా..

రెండో విడతలో మిగిలిన 41 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. వీటికి సంబంధించిన వార్డుల పునర్విభజన ఈ నెల 14తో పూర్తవుతుంది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 10,047 ఎంపీటీసీ, 660 జడ్పీటీసీ స్థానాలకు ఓటర్ల జాబితా తయారీ ఈ నెల 11వ తేదీతో ముగియనుంది.

ఇవి పూర్తయ్యాక అసలైన పల్లె పోరు మొదలవుతుంది. మూడో దశలో రాష్ట్రంలోని 13,295 గ్రామ పంచాయతీలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

వచ్చే ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏపీలో పుర పోరు రసవత్తరంగా మారబోతోంది.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

కైలాసపురంలో దారుణ హత్య
సిగరెట్ తాగేవారికి కేంద్రం షాక్…
ఆగస్టు 1 నుంచి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం..
గూగుల్ తెచ్చిన ఘనత మాది..గన్ కల్చర్ మీది !
విఎంఆర్డిఏలో భారీ అవినీతి !
Share This Article
Facebook Email Print
Previous Article విశాఖలో ఈ – స్టాంపు పేరుతో బహిరంగ దోపిడీ ! విశాఖలో ఈ – స్టాంపు పేరుతో బహిరంగ దోపిడీ !
Next Article స్టాక్ మార్కెట్ నష్టంతో మనస్తాపం – యువకుడిని కాపాడిన భీమిలి పోలీసులు స్టాక్ మార్కెట్ నష్టంతో మనస్తాపం – యువకుడిని కాపాడిన భీమిలి పోలీసులు
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?