By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Reading: నిజ నిర్ధారణ కమిటీపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే !
Share
Notification Show More
Font ResizerAa
Font ResizerAa
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu NewsAkshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News
  • Home
  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా
Follow US
© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Akshara Chaturya News | Andhra Pradesh & Telangana Telugu News > Andhra Pradesh > రాజకీయాలు > నిజ నిర్ధారణ కమిటీపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే !
Andhra Pradeshరాజకీయాలు

నిజ నిర్ధారణ కమిటీపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే !

Anandkumar Vankara
Last updated: July 22, 2026 4:38 pm
Anandkumar Vankara
1 week ago
Share
నిజ నిర్ధారణ కమిటీపై దాడి.. ప్రజాస్వామ్యంపై దాడే !
SHARE

బి.ఎస్.కృష్ణ (ఆల్ఫా కృష్ణ)

మద్దిలపాలెం, జూన్ 30
అక్షర చాతుర్య

అమరావతి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ నిజ నిర్ధారణ కమిటీపై జరిగిన దాడిని జిల్లా పార్టీ అధికార ప్రతినిధి బి.ఎస్.కృష్ణ (ఆల్ఫా కృష్ణ) తీవ్రంగా ఖండించారు. సోమవారం మద్దిలపాలెం కృష్ణ కాలేజి రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమరావతి ప్రాంత రైతులు ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.యస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రభుత్వం భూములను అక్రమంగా స్వాధీనం చేసుకుంటోందని, ప్రశ్నిస్తే బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దీంతో వాస్తవాలు తెలుసుకునేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో జగన్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి అమరావతికి పంపారు.

అయితే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న కమిటీపై తాడేపల్లి వద్ద కర్రలు, రాళ్లతో దాడి జరిగిందని కృష్ణ తెలిపారు. ఈ ఘటనలో ఒక పోలీసు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.

“అమరావతి ఎవరి జాగీరు కాదు”

“ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు ఉంది. ఆ హక్కును హింసతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. అమరావతి ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదు, జాగీరు కాదు. రాష్ట్రంలో అంతర్భాగమైన అమరావతికి వెళ్లే హక్కు ప్రతి పార్టీకి, ప్రతి పౌరుడికి ఉంది” అని ఆయన స్పష్టం చేశారు.

దాడికి పాల్పడిన వారు ఏ పార్టీ వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో సాయికృష్ణ అనే యువకుడి మృతిపై కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలన్నారు.

“అధికారాలు శాశ్వతం కావు, కానీ రాజ్యాంగ విలువలు శాశ్వతం. ప్రభుత్వం విమర్శలను సహించాలి, రైతుల సమస్యలపై స్పందించాలి. నిజ నిర్ధారణ కమిటీపై దాడిపై నిష్పక్షపాత విచారణ జరపాలి” అని కృష్ణ కోరారు.

Share Short News
📄 Generate e-Paper Clip
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email

You Might Also Like

నిబంధనలు గాలికేనా… !
జీవీఎంసీలో 25 మంది ఉద్యోగులకు పదోన్నతులు
నడకపై పన్ను కూటమి ప్రభుత్వ పిచ్చికి పరాకాష్ట
గూగుల్ తెచ్చిన ఘనత మాది..గన్ కల్చర్ మీది !
మాజీ మంత్రి అప్పల నరసింహరాజు కన్నుమూత
Share This Article
Facebook Email Print
Previous Article జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఉత్తర్వులు తక్షణం జారీ చేయండి – కలెక్టర్ ఆదేశం జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఉత్తర్వులు తక్షణం జారీ చేయండి – కలెక్టర్ ఆదేశం
Next Article విశాఖలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ట్యాక్స్ కలెక్టర్ విశాఖలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ట్యాక్స్ కలెక్టర్
about us

Akshara Chaturya is an independent Telugu digital news platform committed to responsible and people-focused journalism. Our aim is to present news in a clear, simple, and truthful manner without exaggeration or sensationalism.

Useful Links

  • About Us
  • Contact Us
  • Advertise With Us
  • Editorial Policy

Categories

  • Andhra Pradesh
  • Telangana
  • క్రీడా
  • పర్యావరణం
  • ఫ్యాషన్
  • వినోదం
  • సినిమా

Legal

  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer

Find Us on Socials

© 2026 Akshara Chaturya. All Rights Reserved. Designed & Developed by OneClick Solutions
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?