23 నుంచి జిల్లా స్థాయి నృత్యపోటీలు
డాబా గార్డెన్స్.. జనవరి 10
అక్షర చాతుర్య
మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నం గా సంక్రాంతి పండుగ నిర్వహించుకుంటామని వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పేర్కొన్నారు. శనివారం డాబా గార్డెన్స్ విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం సంక్రాంతి సంబరాలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ భావి తరాలకు ఇటువంటి పండుగలు దిక్సూచిగా నిలుస్తాయని.. సామాజిక ప్రగతికి తోడ్పాటునందిస్తాయ న్నారు…ప్రపంచంలో బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సేవలు ప్రశంసనీయమన్నారు.. బ్రహ్మకుమారిస్ బి కె రామేశ్వరి మాట్లాడుతూ శాంతి, సౌభాగ్యం, సంక్షేమ కుటుంభ సమేత కలయికల పండుగ సంక్రాతి అన్నారు. పెద్దల పండుగ అని పిలుచుకునే ఈ పండుగ సందర్బంగా మన పూర్వికులను గౌరవించడం ఆనవాయితీ గా వస్తుందన్నారు.. అలాగే భోగి సంక్రాంతి కనుమ పండుగలు విశిష్టతను తెలియజేశారు..జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి . ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ కళలను, సంస్కృతి సంప్రదాయలను నేటి తరంలో అవగాహన పెంచడానికి ఇటువంటి ఉత్సవాలు ఎంతో అవసరం అన్నారు. ఆధ్యాత్మిక చింతన మనలో క్రమశిక్షణ ను ఆత్మ స్థైర్యాన్ని పెంచుతాయన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ జర్నలిస్ట్ ఆర్. నాగరాజ్ పట్నాయక్, సిస్టర్ సోమేశ్వరి తదితరులు పాల్గున్నారు. అనంతరం జర్నలిస్ట్ సోదరులకు ప్రత్యేకంగా తయారుచేసిన మిఠాయిలు పంపిణీ చేసారు.
23 నుంచి జిల్లా స్థాయి డాన్స్ పోటీలు
జనవరి 23వ తేది నుంచి రెండు రోజుల పాటు విశాఖ జిల్లా స్థాయి డాన్స్ పోటీలను నిర్వహిస్తున్నామని రమేశ్వరి పేర్కున్నారు. స్కూల్ ఆఫ్ థియేటర్స్ అర్ట్స్ సౌజన్యం తో సీతమ్మధారలో శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ఎదురుగా ఉన్న ఏ.పీ.ఎస్.ఈ.బి. కాలనీ సమావేశ మందిరం లో 23వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ఈ పోటీలు శాస్త్రీయ, జానపద అంశాల్లో సోలో,డ్యూయెట్, ట్రియో (ముగ్గురు ) విభాగాల్లో జరుగుతాయన్నారు. 12 సంవత్సరాల లోపు వారిని జూనియర్స్ గాను, 13 ఏళ్ళు పైబడిన వారిని సీనియర్స్ గాను పోటీల్లో పరిగణించడం జరుగుతుందన్నారు. ప్రతి విభాగాల్లోనూ ప్రధమ,ద్వితీయ, తృతీయ, రెండు ప్రోత్సాహక బహుమతులను విజేతలకు అందించడం జరుగుతుందన్నారు. పాల్గొన్న ప్రతి నృత్య కళాకారులకు ప్రశంసా పత్రాలను అందించడం జరుగుతుందన్నారు. ఆసక్తిగల విశాఖ జిల్లాకు చెందిన నృత్య కళాకారులు ఈ నెల 25 వ తేదీ లోపు 8522990123 ఫోన్ లో సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని జానకి తెలియజేసారు.
