ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు
అమరావతి, ఆగస్టు 18
అక్షర చాతుర్య
రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణను లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన (AP-GREEN) ఏపీ గ్రీన్ కార్యక్రమానికి కొత్త నాయకత్వం లభించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావును AP-GREEN ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయనకు క్యాబినెట్ ర్యాంక్ హోదాను కూడా కల్పించింది.
ప్రధాన బాధ్యతలు ఏమిటంటే !
(AP-GREEN) ఏపీ గ్రీన్ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే మొక్కలు నాటే కార్యక్రమాలు, అటవీ ప్రాంతాల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ చర్యలన్నింటినీ నాగేంద్రరావు గారు సమన్వయం చేయనున్నారు. వివిధ శాఖల మధ్య సమన్వయం, నిధుల వినియోగం, లక్ష్యాల అమలుపై ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు.
నాగబాబు గారి నియామకంతో (AP-GREEN) ఏపీ గ్రీన్ కార్యక్రమాలకు మరింత ఊపు వస్తుందని, రాష్ట్రంలో పచ్చదన శాతం పెంచే లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
