విశాఖపట్నం, ఆగస్టు 24:
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని NRI College ఆధ్వర్యంలో ఆగస్టు 24, 2026న నిర్వహించిన ప్రత్యేక పోటీల్లో SFS, Keystone, Bhasyam, Pollocks, Sri Anjana Schoolతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి NRI College AGM ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ పోటీల్లో శ్రీ అంజనా స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచి రెండు బహుమతులను సాధించారు. జి. ఉష తృతీయ బహుమతి సాధించి రూ.3,000 నగదు బహుమతి అందుకున్నారు. అలాగే నీరజ ద్వితీయ బహుమతి సాధించి రూ.5,000 నగదు బహుమతి అందుకున్నారు.
విద్యార్థుల విజయంపై శ్రీ అంజనా స్కూల్ యాజమాన్యం, ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసి, విజేతలను అభినందించారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
