సెల్ ఫోన్ ఎక్కువగా చూస్తుందని తల్లి మందలింపు..
కంచరపాలెం పరిధిలో బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానిక కంచరపాలెం బజారు వద్ద నివాసముంటున్న వైష్ణవి(15) సమీపంలోని హైస్కూల్లో చదువుతోంది. బుధవారం స్కూల్ కి సెలవు కావడంతో ఇంట్లో ఉండగా, వైష్ణవి ఎక్కువగా సెల్ ఫోన్ వాడుతుండడంతో తల్లి మందలించింది. సెల్ఫోన్ తనకివ్వడం లేదని మనస్థాపనతో ఇంట్లోని ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత తల్లి గమనించి కుమార్తెను కేజీహెచ్ కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కంచరపాలెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
